జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్ గా జి స్వరూపారాణి పదవి బాధ్యతలు..
1 min read
మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసిన అదనపు ఎస్పి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: పలువురు అధికారులు పుష్పగుచ్చాలు అందించి అభినందనలుపల్లె వెలుగు, ఏలూరు జిల్లా : ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా జి స్వరూపారాణి పదవి బాధ్యతలను ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎం జె బి భాస్కర రావు నుండి స్వీకరించినారు.నూతన అదనపు ఎస్పీ అడ్మిన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జి స్వరూపారాణి ని అధికారులు అందరూ పుష్పగుచ్చములు అందించి అభినందనలను తెలియ చేసినారు.జి స్వరూప రాణి ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చుం అందించినారు.
