అర్హుల జాబితాను సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి
1 min read– మోహన్ రావు..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల యందు డాక్టర్ వైయస్సార్ రైతు భరోసా అర్హుల మరియు అనర్హుల మొదటి విడత జాబితాను శుక్రవారం నాడు గడివేముల మరియు చిందుకూరు గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన పట్టికను జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు పరిశీలించారు . రైతులకు జాబితాను చూసుకొని ఏదైనా ఫిర్యాదులు ఉంటే 15వ తేదీ లోగా ఫిర్యాదు ఆర్ బి కే సిబ్బందికి తెలియచేస్తే 18 వ తారీఖు వరకు సరిచేసి సవరణ చేసి 20వ తారీఖున తుది జాబితాను ప్రదర్శించడం జరుగుతుందన్నారు . చిందుకూరు గ్రామంలో ఏకర నర్ర పొలంలో మొక్కజొన్న పండించినటువంటి రైతు ధాన్యాన్ని సందర్శించి గిట్టుబాటు ధర, సాగు ఖర్చు, వివరాలు తెలుసుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆర్.బి కేల యందు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఆర్ బి కే కౌంటర్ కూడా మొక్కజొన్న కేంద్రంగా తెలియజేస్తూ కనీస మద్దతు ధరను ధర క్వింటాలు ఒక్కింటికి 1962 గా తెలియజేస్తూ మొక్కజొన్న కొనుగోలు పథకాన్ని సద్విని చేసుకోవాల్సిందిగా రైతుకు తెలియజేశారు .ముఖ్యంగా రెండవ శుక్రవారం కాబట్టి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో మండల వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి గడివేములలో హార్టికల్చర్ విస్తీర్ణం సాగు పెరుగుతుంది కాబట్టి గడివేముల గ్రామము మరియు మండలంలో ఇద్దరు వి ఏ ఏ లు ఉన్నారు . దయచేసి ఒక వి ఏ ఏ మరియు ఒక విహెచ్ఏ హెడ్ క్వార్టర్ లో ఉండేటట్టు పై అధికారులకు తెలియజేయాలని మరియు ప్రతి వ్యవసాయ సిబ్బంది కూడా వేసిన ప్రతి సెంటు పొలాన్ని పంట నమోదు చేసి ప్రభుత్వ పథకాలకు అర్హులను చేయాలని తెలియజేశారు. వెటర్నరీ డాక్టర్ హరిణి పశు పోషణ మరియు వేసవికాలంలో పశుగ్రాసం కొరకు ఉదయం మరియు సాయంకాలమే పశువులను తీసుకువెళ్లాలని తెలియజేశారు . పశువులకు వడ గాలులు సోకినట్టయితే చల్ల నీళ్ల తో పశువులను శుభ్రపరచాలని తెలియజేశారు. ఉపాధి హామీ పథకం ఈసీ వారు మన గడివేముల మండలానికి హార్టికల్చర్ పెంపకం లో భాగంగా 1700 ఎకరాలు మామిడి, అరటి ఇతర పండ్ల తోటల ను టార్గెట్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. జిల్లా వ్యవసాయ అధికారి టి మోహన్ రావు గారు మండలం లో యంత్ర సేవా పథకం కింద ఐదు గ్రూపులు మిగిలినాయి అందరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు .40 శాతం సబ్సిడీ 10% రైతు కాంట్రిబ్యూషన్ అని తెలిపారు. ప్రతి ఆర్ బి కే నందు 200 టన్నుల వివిధ రకాల ఎరువులు ఈ సంవత్సరానికి టార్గెట్గా ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు. పచ్చి రొట్టె ఎరువు లైన జిలుగలు 118 క్వింటాళ్లు, పిల్లి పెసర 12 క్వింటాళ్ల అలాట్మెంట్ ఇచ్చామని అదేవిధంగా రైతు భరోసా కేంద్రం వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేశారు. జీలుగా పూర్తి ధర 79 మరియు పిల్లి పెసర 97 రూపాయలు. ప 50% సబ్సిడీతో రైతులు ఈ పథకాన్ని వినియోగించాలని తెలియజేశారు. అదేవిధంగా 2023 వ సంవత్సరం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం కనుక సాగులో మెలకువలు వాటి లో పోషకాల ప్రాముఖ్యత తెలియజేశారు. రైతు సోదరులందరూ ఖరీఫ్ మరియు రబిలో సాగు చేసినటువంటి పంట ధ్రువీకరణ పత్రాన్ని విధిగా తీసుకొని భద్రపరుచుకోవాలని తెలియజేశారు.