PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలల సంక్షేమంపై జిల్లా బాలల కమిటీ సమీక్ష

1 min read

కమిటీ తమ పనితీరును మెరుగుపరచుకోవాలి

జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ హెచ్చరిక

సమావేశానికి హాజరు కాకపోవడంతో సంక్షేమ కమిటీ సభ్యుల పై కలెక్టర్ ఆగ్రహం

పల్లెవెలుగు వెబ్  ఏలూరు జిల్లా ప్రతినిధి : అనాధారణ గురైన బాలల సంరక్షణను చేపట్టవలసిన జిల్లా బాలల సంక్షేమ కమిటీ తమ పనితీరును మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ వె ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు.  స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం బుధవారం  బాలల సంక్షేమంపై జిల్లా బాలల సంక్షేమ కమిటీ తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ కారణాలతో నిరాదరణకు గురైన బాలల వివరాలు, వారి  సంక్షేమానికి తీసుకున్న చర్యలపై జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యులు సరైన సమాచారం అందించకపోవడం, పూర్తి సమాచారంపై సమావేశానికి హాజరు కాకపోవడంపై  బాలల సంక్షేమ కమిటీ సభ్యులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  18 సంవత్సరాలలోపు వయస్సు కలిగి నిరాదరణకు గురైన బాలలు, చైల్డ్ లేబర్, బాల్య వివాహాలు, పోక్సో చట్టం లో బాధితులకు, తదితర బాలలకు జువైనల్ ఆక్ట్ ప్రకారం సంక్షేమం చూసి, వారికి న్యాయ సహాయం, వారికి న్యాయం జరిగే వరకు  రక్షణ  అందించాల్సిన బాధ్యత  జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఉందని, ఇందుకు సంబంధించి జిల్లాలో పలు కేసులు నమోదయినప్పటికీ వాటికి సంబందించిన సమాచారాన్ని సమీక్షలో  జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యులు సక్రమంగా తెలపక పోవడంతో, సరైన అవగాహన లేకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, తదుపరి సమావేశానికి పూర్తి వివరాలతో హాజరు కావాలని, లేని పక్షంలో జిల్లా బాలల సంక్షేమ కమిటీ రద్దుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని హెచ్చరించారు.  బాలల సంక్షేమానికి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ అధికారి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు.  సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మావతి, చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్ శ్రీ వల్లి , జిల్లా బాలల సంరక్షణ అధికారి సూర్యచక్రవేణి, జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యులు పి . వెంకటేశ్వరరావు, కెల్లా హైమావతి, రాజేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author