మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
1 min read
గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు
పల్లెవెలుగు,పశ్చిమగోదావరి జిల్లాప్రతినిధి: బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం శ్రీ మావుళ్ళమ్మ వారిని దర్శించుకున్నారు. తొలుత విఘ్నేశ్వర స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఇఓ, ప్రధాన అర్చకులు స్వాగతం పలికి అంతరాలయానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ జిల్లా కలెక్టర్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆశీర్వచన మండపం నందు దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు ఆశీర్వచనాలు పలకగా, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ, తదితరులు పాల్గొన్నారు.