PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ.వి.యమ్ గోడౌన్స్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

1 min read

– వి వి ప్యాడ్స్ ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వి.వి ప్యాడ్స్ ను స్థానిక కలెక్టరేట్ ప్రాంగణము లోని ఈవీఎం గోడౌన్స్ లో పకడ్బందీగా భద్రపరచాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం స్థానిక కలెక్టరేట్ లోని ఈ.వి.యమ్ గోడౌన్స్ ను వివిధ రాజకీయ పార్టీల  ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన, పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు  కలెక్టర్ డాక్టర్ జి.సృజన మాట్లాడుతూ  వి.వి ప్యాడ్స్ పరిశీలించడం జరిగిందని, ఈవీఎం లు కూడ ఈనెల 30 వ తేది నాటికి జిల్లాకు చేరుతాయని అన్నారు. అక్టోబర్ 20వ తేది నుండి ఈవీఎం  ఫస్ట్ లెవెల్ చెకప్(FLC) చేయడం ప్రారంభిస్తారని కలెక్టర్ తెలియజేశారు. ఈవిఎం గోడౌన్ ను శుభ్రం చేయించి, వైట్ వాష్ వేయించి తగిన లైటింగ్ ను కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళిని ఆదేశించారు వచ్చిన ఓటింగ్ యంత్రాలను పకడ్బందీగా భద్రపరచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్, టిడిపి, నేషనల్ కాంగ్రెస్, సిపిఐ, బిజెపి,BSP రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈవీఎం ల FLC(ఫస్ట్ లెవెల్ చెకప్) నోడల్ అధికారి మరియు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి, తదితరులు పాల్గొన్నారు.

About Author