PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా కలక్టర్, జాయింట్ కలెక్టర్ చే రెవెన్యూ డైరీ ఆవిష్కరణ..

1 min read

ఏ.పీ జెఎసి అమరావతి జిల్లా అధ్యక్షులు కె రమేష్ కుమార్

అసోసియేషన్ సంఘాలన్నీ ఐక్యమత్యంగా ప్రభుత్వానికి సహకరించాలి

అసోసియేషన్ సంఘాలు ఐక్యమత్తంగా ఉండి ప్రభుత్వాన్ని సహకరించాలి

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఉన్నతాధికారులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు   :  నూతన సంవత్సర సందర్భముగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మరియు AP JAC అమరావతి ఛైర్మెన్ కె  రమేష్ కుమార్  అద్వర్యములో   జిల్లా కలక్టర్  ప్రసన్న వెంకటేష్ ని మర్యధపుర్వకముగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేయడము జరిగినది. అదేవిధముగా వారి చేతుల మీదుగా రెవెన్యూ డైరీ ని ఆవిష్కరించడం జరిగినది. జిల్లా కలక్టర్  మాట్లాడుతు ఈ నూతన సంవత్సరము సందర్భముగా జిల్లాలో వున్న ఉద్యోగుల  జీవితాలలో వెలుగులతో నిండాలని వారి అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ సంఘాలన్నీ ఐక్యమత్యంగా మేముఉండి ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు ఆకాంక్షించారు. అదేవిధముగా జిల్లా జాయింట్ కలక్టర్ బి‌. లావణ్య వేణి ని కూడా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారి చేతుల మీదుగా రెవెన్యూ కాలెండర్ ను ఆవిష్కరించడము జరిగినది. అదేవిధముగా జిల్లా రెవెన్యూ అధికారి  వేంకటేశ్వర రావు ని కలిసి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడము జరిగినది. మరియు రెవెన్యూ డివిజినల్ అధికారి, ఏలూరు N.Sk. ఖజావలి ని కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేయడము జరిగినది. ఈ కార్యక్రమములో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఏ. ప్రమోద్ కుమార్, APJAC అమరావతి కార్యదర్శి బి. రాంబాబు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రవిచoద్ర, ఏలూరు డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ స్వామి, కలక్టరేట్ యూనిట్ ప్రెసిడెంట్ యశ్వంత్, APRSA జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రెసిడెంట్ రమేష్, APRSA జిల్లా నాయకులు శ్రీను, మాధవి సోమేశ్వరరావు మరియు APJAC అమరావతి మహిళా విభాగము నాయకులు సుందరి, శాంత కుమారి, గీతిక, యామిని తదితరులు.

About Author