PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాయపడిన చిన్నారులను అక్కున చేర్చుకున్న జిల్లా కలెక్టర్ కె వేట్రిసెల్వి

1 min read

అధికారులకు సంరక్షణ బాధ్యతలు,స్పందించి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలు

మెరుగైన విద్య,వైద్యం అందించాలని ఆదేశాలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: గత ఆదివారం రోజున అన్న చెల్లెలను చిత్రహింసలు గురిచేసిన సంఘటనలో  జిల్లా కలెక్టర్ వారు వెంటనే స్పందించి అందరిని ఎలర్ట్ చేసి వారికి మంచి ట్రీట్మెంట్ అందించేటట్టు చేసి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ లో అడ్మిట్ చేసి చికిత్స అందించిన తర్వాత వారికి పూర్తిగా నయం అయిన తర్వాత బుధవారం డిశ్చార్జ్ చేశారు.సదరు విషయాన్ని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి  తెలుసుకుని వెంటనే మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ అధికారి  శారద డిసిపిఓ సూర్యచక్రవేణిని హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకువచ్చి సిడబ్ల్యుసి వారి ముందు హాజరు పరిచి  జోనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారము ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ అంతా అనుసరించాలని  స్పష్టం చేశారు. కలెక్టర్  ఆదేశాల మేరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారతాధికారి పి శారద ,జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కి వెళ్లి ప్రొసీజర్లన్నీ కంప్లీట్ చేసి మెడికల్ గాను, పోలీసువారి ద్వారాను అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఏలూరులోని  జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ని కలవడం జరిగింది.ఈ సందర్బంగా  కలెక్టర్  కె.వెట్రిసెల్వి ఆ పిల్లల్లో మనోధైర్యాన్ని నింపి వారితో చాలాసేపు సంభాషించి, జరిగిన విషయం అంతా వివరంగా తెలుసుకున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలన్నారు. పెద్దయ్యాక  ఏమవుతారని పిల్లలను కలెక్టర్  అడిగి తెలుసుకుని వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, వారికి ఏది అవసరమైన అన్ని తానుగా చూస్తానని భరోసా ఇచ్చారు.అదేవిధంగా ఈ సంఘటన తెలిసిన తర్వాత స్పందించిన హృదయాలను, ఫైనాన్షియల్ గా సహాయం చేస్తామని చాలామంది ముందుకు రావడం జరిగిందని, దానికి గౌరవ కలెక్టర్ గారు స్థానిక జంగారెడ్డిగూడెం ఆర్టిఓ  ద్వారా పిల్లలకు గార్డియన్ గా  పెట్టి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దానిలో ఇప్పటివరకు 5 వేలు చొప్పున ఒకరు, 20,000  మరొకరు, 1500 ఒకరు ఈ విధంగా ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. పిల్లలు భవిష్యత్తుకి అవసరమైన చదువుని అందించడానికి గౌరవ కలెక్టర్ గారు బాధ్యత తీసుకుంటానని పిల్లలకు ఎప్పుడు ఏమి అవసరమైనా వెంటనే తనని సంప్రదించవచ్చని పిల్లలకి భరోసా కల్పించడం జరిగింది. పిల్లల్ని పెద్ద అయిన తర్వాత ఏమవుతారు అనగా ఉదయ్ రాహుల్ అయితే పోలీస్ అవుతానని రేణుక డాక్టర్ అవుతానని తెలియజేశారు .వారు ఇప్పటినుంచి బాగా యాక్టివ్ గా ఉండి పౌష్టికాహారం తీసుకుంటూ,బాగా చదువుకుంటే వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అందరూ సహకరిస్తారని వారిలో నూతన  ఉత్సాహాన్ని నింపి వారికి మరింత మనోధైర్యాన్ని కల్పించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ద్వారా వారి ఆదేశాల ప్రకారము వారు ఎక్కడ షెల్టర్ చేస్తే అక్కడ రిహాబిలిటీ చేయమని పిడి,ఐసిడిఎస్ శారద కు తెలిపారు.వెంటనే వారిని అక్కడినుండి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ముందు హాజరు పరిచయం అయింది కమిటీ వారు స్థానిక లైసెన్స్ పొందిన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ నందు ఈ బాలబలికలిద్దరికీ వసతి కల్పించటమైంది. అక్కడే ఉండి వారు చదువు కొనసాగించడానికి వైద్యపరంగా వారికి ఏ అవసరమైన వెంటనే అటెండ్ అవ్వమని సదరు హోం  సూపరింటెండెంట్ ను అదేశించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్   శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి, జంగారెడ్డిగూడెం సిడిపిఓ  బ్యూలా, జంగారెడ్డిగూడెం ఏరియా జి ఎం ఎస్ కే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వీరికి ఆదివారం నుండి ఈరోజు వరకు కూడా దగ్గరుండి అమ్మల లాలించిన స్థానిక అంగన్వాడీ టీచర్ లీలారాణి తదితరులను కలెక్టర్  అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *