NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలపర్రు జెడ్పి పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

1 min read

తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదపాడు మండలం కలపర్రు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహణ తీరును పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనుకుంటే తరచూ పాఠశాలకు వెళ్లి వారి విద్యా ప్రగతిని పరిశీలించాలన్నారు.  విద్యార్ధులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు.  దీనిని సార్ధకం చేసేందుకే . రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మెగా టీచర్స్ సమావేశాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠాశాలలు, జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేశామన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఖర్చుచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ గారపాటి రామసీత, డిఇఓ ఎం.వెంకటలక్ష్మమ్మ, ఏ.కృష్ణ జ్యోతి,యంపిడివో అమీన జామ, మండల విద్యాశాఖ అధికారి యస్.నరసింహా మూర్తి,  ప్రధానోపాధ్యాయులు కె.భీమయ్య, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు బి.రాజేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *