రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం
1 min read– ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు తగిన చర్యలు చేపడుతున్నాం
జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఇంటింటి సర్వే మరియు స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2024 కార్యక్రమాన్ని విజయవంతంగా ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన తుది ఓటర్ల జాబితాను జనవరి 5 వ తేది 2024 సంవత్సరమున ప్రచురించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా అందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 పై జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తో కలిసి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వే మరియు స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2024 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా జనవరి 5 వ తేది 2024 సంవత్సరమున పటిష్టమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని అందుకు గాను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ తెలిపారు. ప్రధాన ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 లో ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈఆర్వో, ఎఈఆర్వో, బూత్ లెవెల్ అధికారులకు ఇప్పటికే స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 కి సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహించామని, జూలై 21 నుండి ఆగస్టు 21, 2023 వరకు బూత్ లెవెల్ స్థాయి అధికారులతో ఇంటింటి ఓటర్ల పరిశీలన చేయడం జరుగుతుందని, ఆ తర్వాత అందుకు సంబంధించిన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేయడం జరుగుతుందన్నారు. బూత్ లెవెల్ స్థాయి అధికారులతో ఇంటింటి ఓటర్ల పరిశీలన చేస్తున్న సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎటువంటి అపోహాలు ఉండకుండా అన్ని రకాల పార్టీలకు సంబంధించిన వారు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకొని వారు కూడా భాగస్వామ్యుల అయ్యేలా చూడాలని సదరు బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి వారి కార్యాలయమునకు సమర్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. జూలై 21 నుండి ఆగస్టు 21, 2023 వరకు బూత్ లెవెల్ స్థాయి అధికారులతో ఇంటింటి ఓటర్ల పరిశీలన చేయడం జరుగుతుందని అప్పుడు గుర్తించిన మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన లిస్ట్ తయారు చేసి అక్టోబర్ 17, 2023న సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందని, ప్రచురించిన జాబితాకు సంబంధించిన దరఖాస్తులు మరియు అభ్యంతరాలను అక్టోబర్ 17, 2023 నుండి నవంబర్ 30, 2023 వరకు స్వీకరించడం జరుగుతుందని, దరఖాస్తులు మరియు అభ్యంతరాల స్వీకరణకు అక్టోబరు 28, 29 మరియు నవంబరు 18, 19 తేదీల్లో బూత్ స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అందుకు సంబంధించిన పరిష్కారం డిసెంబర్ 26 నాటికి పూర్తి చేసి జనవరి 5, 2024 న తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. బూత్ లెవెల్ స్థాయి అధికారులు ఓట్లను తీసివేయడం గాని చేర్చడం గాని ఉంటుందని కొంతమందికి అపోహాలు ఉన్నాయని బూత్ స్థాయి అధికారులకు ఆ విధంగా చేసే అధికారం లేదని ఆ అధికారం కేవలం ఈఆర్ఓ లకు మాత్రమే ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. బూత్ స్థాయి అధికారులు కేవలం నోటీసులు సర్వ్ చేయడానికి, క్షేత్రస్థాయిలో విచారించి తగిన నివేదికలు ఇవ్వడానికే మాత్రమే ఉపయోగిస్తామన్నారు. ఓటర్లను తొలగించే అంశంలో కూడా రెండు శాతం కంటే ఎక్కువ చేస్తే ప్రతి ఓటర్ తొలగింపుకు ప్రధాన ఎన్నికల అధికారి వారికి వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం పూర్తి అయ్యేవరకు ప్రతి మంగళవారము నియోజకవర్గ స్థాయిలో ప్రతి నియోజకవర్గ కేంద్రములో ఈఆర్ఓ, ఎఈఆర్ఓ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారని అలాగే ప్రతి బుధవారము జిల్లా స్థాయిలో కలెక్టరు/జిల్లా ఎన్నికల అధికారి వారి కార్యాలయములో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశము నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఇంటింటి పరిశీలన కార్యక్రమము నందు పాల్గొని ప్రస్తుతము ఉన్న ఓటర్ల జాబితాలో ఎమైనా ఇంటి నెంబర్లు / ఓటర్ల వయసు/పుట్టినతేదీలు / ఒకే ఇంటి నందు ఎక్కువ మొత్తములో ఓటర్లు ఉండుట లాంటి పొరపాట్లను గమనించిన యెడల వాటిని సంబంధిత బి.యల్.ఓ./ఏ.ఈ.ఆర్.ఓ / ఈ.ఆర్.ఓ / జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావలసిందిగా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. అదే విధంగా https://ceoandhra.nic.in, https://voters.eci.gov.in వెబ్సైట్, Voters Helpline మొబైల్ ఆప్ ద్వారా పోలింగ్ కేంద్రాల వారీగా ప్రజలు/ఓటర్లు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు అయినదో లేదో చూసుకోవచ్చని, సంబంధిత విషయమును కూడా ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. 01.01.2024 నాటికి 18 సంవత్సరముల వయసు ఉన్న యువతి, యువకులు అర్హత కలిగి ఓటర్లుగా నమోదు కాకుంటే వారి నుండి సంబంధిత పత్రాలు తీసుకొని జనవరి 5వ తేదీన ప్రచురించినున్న చివరి జాబితాలో వారిని పొందుపరచగలమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి ఏ ఇంటికి ఎన్ని ఓట్లు ఉన్నాయని అనే నివేదికలు కూడా ఈఆర్ఓ లకు వచ్చాయని అందులో ముఖ్యంగా ఒకే ఇంటి నెంబర్ మీద 10 ఓట్లు నమోదు అయిన వాటి మీద ప్రత్యేక శ్రద్ధ నిర్వహించి అందుకు సంబంధించిన డ్రైవ్ నిర్వహించి అటువంటి వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. మేము ఏ విధంగా వాటిని పరిష్కరిస్తున్నాము అనే అంశాన్ని కూడా మీరు సంబంధిత బూత్ లెవెల్ స్థాయి అధికారులతో సంప్రదించి తెలుసుకోవచ్చని రాజకీయ ప్రతినిధులకు సూచించారు. తీసుకోవాలని, పోలింగ్ స్టేషన్లకు కొన్ని ప్రాంతాలలో వెళ్లడానికి సరైన మార్గం లేదని అటువంటి వాటిని మార్చి వేరే ప్రదేశంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా ఇంటింటి సర్వే మరియు స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2024 కార్యక్రమం గురించి పాంప్లెట్స్, పత్రిక ప్రకటన, సిటీ కేబుల్ ఛానల్, సినిమా థియేటర్లో స్లైడ్స్, ఎఫ్ఎం రేడియోల మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అదే విధంగా అటువంటి పోలింగ్ స్టేషన్ల గురించి తగిన చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ తెలిపారు.సమావేశంలో మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ, డిఆర్ఓ నాగేశ్వరరావు, కర్నూలు ఆర్డిఓ హరిప్రసాద్, ఏఈఆర్ఓలు, ఎలక్షన్ సూపరిడెంట్ మురళి, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇంఛార్జి అరుణ్ కుమార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్తా, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ కె.ఈ.జగదీష్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పుల్లారెడ్డి, బి.ఎస్.పి పార్టీ నుండి మధుకర్, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ ఎల్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.సమస్యలు పరిష్కరించాలి కెసిటిఆర్ యూత్ సభ్యులు.పల్లెవెలుగు వెబ్ హోలగుంద:ఇంగలదహల్ గ్రామంలో రాష్ట్రా కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు సచివాలయం ప్రారంభోత్సవానికి గడపగడప కార్యక్రమానికి వచ్చిన మంత్రికి కేసి తిమ్మారెడ్డి యూత్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు విరేష్ చంద్రశేఖర్ యూత్ సభ్యులు గ్రామంలోని సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలో ప్రధానంగా ఉన్న డ్రైనేజీలు,సిసి రోడ్లు మరియు తాగునీటి కుళాయి కలక్షన్ గురించి అదేవిధంగా పాఠశాలకు రహదారి గురించి మంత్రికి తెలియజేయగా గడపగడపకు కార్యక్రమానికి వచ్చిన నిదులతో సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాండు, రాజు,మహేష్,ఎస్ఎఫ్ఐ మల్లికార్జున గ్రామ పెద్దలు పాల్గొన్నారు.