PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరైన కర్నూలు జిల్లా కలెక్టర్

1 min read

నీతి ఆయోగ్ సమావేశాలకు దేశంలోని 5 రాష్ట్రాల నుండి 5 మంది కలెక్టర్ లు ఎంపిక

ఎంపికైన 5 మంది కలెక్టర్ లలో  కర్నూలు  జిల్లా కలెక్టర్ ఒకరు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తో కలిసి సమావేశాలకు హాజరైన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

కర్నూలు జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణ, రక్తహీనత పరీక్షలు, నివారణ చర్యలపై  (రేపు)గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  ప్రధానమంత్రి కి నివేదించనున్న జిల్లా కలెక్టర్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఢిల్లీ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశాలకు కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన హాజరయ్యారు.నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థికాభివృద్ధి అంశాలపై జాతీయ స్థాయిలో  అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఈ నెల 26 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు సమావేశాలు  నిర్వహించడం జరుగుతోంది…. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు దేశంలోని 5 రాష్ట్రాల నుండి 5 జిల్లాల కలెక్టర్ లు ఎంపిక అయ్యారు.. ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి 5 గురు జిల్లా కలెక్టర్ లు హాజరు కాగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఈ సమావేశాలకు హాజరు కావడం విశేషం.గురువారం ప్రధానమంత్రి  ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న కలెక్టర్ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కర్నూలు జిల్లాలో గ్రామ, వార్డ్ సచివాలయాల సహకారంతో బాల్య వివాహాల నియంత్రణకు జరుగుతున్న కృషి, బడి బయట పిల్లలను బడిలో చేర్పించడం, 10 నుండి 19 సంవత్సరాల బాలికలకు, గర్భిణీ స్త్రీలకు రక్తహీనత పరీక్షల నిర్వహణ,రక్త హీనత నివారణకు పాఠశాలల్లో  విద్యార్థులకు  ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ పంపిణీ, అంగన్వాడీల్లో గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు  పోషకాహారం అందించడం, విద్యాభివృద్ధి తదితర అంశాలపై  భారత ప్రధాన మంత్రి, నీతి ఆయోగ్ చైర్మన్  శ్రీ నరేంద్ర మోడీ కి గురువారం కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు.ఇందులో భాగంగా బుధవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్ రెడ్డితో కలిసి  కర్నూలు జిల్లా కలెక్టర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు.

About Author