NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష

1 min read

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ర్ట ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను  సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా అధికారులను ఆదేశించారు.ఈ నెల 25,26 తేదీల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో  ముఖ్యమైన అన్ని  శాఖల జిల్లా అధికారులతో  అభివృద్ధి కార్యక్రమాల అమలు,పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు.. వ్యవసాయ శాఖ సమీక్షలో భాగంగా  ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ని ఆదేశించారు..వ్యవసాయ యాంత్రీకరణ లో భాగంగా 50 శాతం సబ్సిడీ తో యంత్ర పరికరాలు ఇవ్వడం జరుగుతోందని, మార్చి 31 వ తేది నాటికి గుర్తించిన రైతులకు పరికరాలను  ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు.. విలేజ్ లెవెల్ ఫాం మెషినరీ కింద డ్రోన్స్ మంజూరు చేసేందుకు 40 గ్రూప్ లను ఐడెంటిఫై చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు..ఎరువుల పంపిణీ కి సంబంధించి రైతుల నుండి  ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరిగిందని,  వ్యతిరేకత కు సంబంధించిన వివరాలు తీసుకుని సమస్యలే వైనా ఉంటే  పరిష్కరించాలని  కలెక్టర్  ఆదేశించారు.. సాయిల్ శాంపిల్ టెస్ట్  కు సంబంధించి టెస్ట్ ఫలితాలను వెంటనే  ఆన్లైన్ లో అప్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు  .పెండింగ్ లో ఉన్న కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు..ఐసిడిఎస్ కి సంబంధించి 146 అంగన్వాడి సెంటర్ లను సాక్షం అంగన్వాడి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్న సందర్భంగా నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ఈని ఆదేశించారు.కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, సీపీఓ హిమ ప్రభాకర్ రాజు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author