ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయాన్ని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన.గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రింటింగ్ ప్రెస్ భవనం పై కప్పు సీలింగ్ స్థితిని చూసి కొన్ని మైనర్ రిపేర్లు చేయాల్సి ఉందని కలెక్టర్ గుర్తించారు..బ్యాలెట్ పేపర్లు ఇక్కడి నుంచే ముద్రించనున్నందున అన్ని విధాలా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. అదే విధంగా భద్రతా పరంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు.. భవన మరమ్మతులకు సంబంధించి ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయ ఇంఛార్జి మేనేజర్ తో కోఆర్డినేట్ చేసుకొని ఎస్టిమేట్స్ తయారు చేయాలని కలెక్టర్ ఆర్ అండ్ బి ఎస్ఈ ని ఆదేశించారు. ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిఆర్ఓ మల్లికార్జునుడు, ఆర్ అండ్ బి ఎస్ఈ నాగరాజు, కర్నూలు ఆర్డిఓ హరి ప్రసాద్, ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయ ఇంఛార్జి మేనేజర్ చంద్రశేఖర్, కర్నూలు అర్బన్ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.