వైయస్సార్ హెల్త్ క్లినిక్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్
1 min read– జల జీవన్ మిషన్ 30.50 లక్షలు వవ్యంతో 60 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ శంకుస్థాపన..
– ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం. దెందులూరు శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు ఏలూరు జిల్లా కలెక్టర్ పెదవేగి మండలంలోని కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.00 గంటలకు పెదవేగి పి హెచ్ సీ లో 15వ ఆర్ధిక సంఘం హెల్త్ గ్రాంట్ నుండి రూ.50.00 లక్షల అంచనా విలువతో మంజూరు కాబడిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ శంకుస్థాపన చేస్తారు. అనంతరంమధ్యాహ్నం 3.30 ని.లకు రామశింగవరం గ్రామములో రూ.40.00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణము చేసిన సచివాలయ భవనమును ప్రారంభించారు. రూ.20.80 లక్షల వ్యయంతో నిర్మాణము చేసిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ని ప్రారంభించారు. రూ.21.80 లక్షల వ్యయంతో నిర్మాణము చేసిన రైతు భరోసా కేంద్రమును ప్రారంభించారు.జలజీవన్ మిషన్ నిధులతో రూ.30.50 లక్షల వ్యయంతో 60 వేల లీటర్ల సామర్ధ్యంతో కొత్తగా మంజూరు కాబడిన వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేశారు.25 లక్షల వ్యయంతో నిర్మాణము చేసిన రామశింగవరం టు బాదరాల బి టి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందని దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి అన్నారు.మొత్తం రూ.188.10 లక్షలు వ్యాయం తో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాత రమ్య , డిఎం&హెచ్ ఓ డాక్టర్ ఆశ , పెదవేగి ఎంపీడివో జి రాజ్ మనోజ్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.