PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటిగ్రేటెడ్‌ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్

1 min read

– పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా మరియు పిన్నాపురం గ్రామల మధ్య గ్రీన్ కో కంపెనీ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (5,230 మెగావాట్స్ సామర్థ్యం) ను ప్రాజెక్టు నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మరియు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సందర్శించారు .బుధవారం ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణ పల్లి-గుమ్మటం తాండా వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ (గ్రీన్ కో) నందు నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను మరియు ఓర్వకల్లు మండలం శకునాల గ్రామ పరిధిలో గ్రీన్ కో సంస్థ అధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు.ముందుగా గ్రీన్ కో కంపెనీ ప్రతినిధులైన ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.హెచ్.శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ మరియు పాణ్యం ఎమ్మెల్యే గారిని పవర్ హౌస్ లోకి తీసుకొని వెళ్లి అక్కడ ఉన్న టర్బైన్ ని చూపిస్తూ అప్పర్ రిజర్వాయర్ నుండి వాటర్ టర్బైన్స్ మీద పడి టర్బైన్ ఏవిధంగా రొటేట్ అయి పవర్ జనరేట్ అవుతుందో జిల్లా కలెక్టర్ గారికి మరియు పాణ్యం శాసనసభ్యులకు వివరించారు. తర్వాత అప్పర్ రిజర్వాయర్ వద్దకు తీసుకుని వెళ్లి నీరు ఏ విధంగా అప్పర్ రిజర్వాయర్ నుండి పవర్ హౌస్ లో ఉన్న టర్బైన్ మీద పడుతుందో క్లుప్తంగా వివరించారు. అదేవిధంగా లోయర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని లోయర్ రిజర్వాయర్ నుండి అప్పర్ రిజర్వాయర్ వద్దకు తీసుకొని వెళ్లే ప్రక్రియను వివరించారు. విద్యుత్ అవసరము ఉన్నప్పుడల్లా 24 గంటలు ఉత్పత్తి చేసుకోవచ్చు అని ఈ ప్రొజెక్టు పంప్డ్‌ స్టోరేజ్, పవన, సౌర విద్యుత్‌ల సముదాయం అని తెలిపారు. డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో (నాన్‌ పీక్‌ అవర్స్‌లో) సోలార్, విండ్‌ పవర్‌ను ఉపయోగించుకుని నీటిని రిజర్వాయర్‌లోకి పంప్‌ చేయడం ద్వారా మరలా నీటిని డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో (పీక్‌అవర్స్‌లో) వినియోగించుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఈ ప్రాజెక్టులో ఉందని జిల్లా కలెక్టర్ గారికి గ్రీన్ కో ప్రతినిధి వివరించారు. గత సంవత్సరం మే 17వ తేదీన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొదటి కాంక్రీట్ పోరింగ్ పనులను ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ గారికి తెలియచేశారు. 2023 సంవత్సరం చివరి నాటికి ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ గ్రీన్ కో సంస్థ వద్ద ఉన్న మొబైల్ క్లినిక్స్ ద్వారా గ్రామాల్లో ఇంతకు మునుపు సేవలు అందిస్తున్న విధంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ కాన్సెప్ట్ వారితో సమన్వయం చేసుకొని మీ వద్ద ఉన్న మెడిసిన్ మరియు ప్రత్యూమ్నయంగా డాక్టర్లను ఏర్పాటు చేసి సమన్వయంగా పనిచేసేలా చూడాలని గ్రీన్ కో ప్రతినిధులైన ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ని కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ కో కంపెనీ వారు నిర్మిస్తున్న ఈ పంప్ డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఒక తలమానికమైనదని, మరియు దేశంలోనే ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చని పేర్కొన్నారు.అంతకుముందు గ్రీన్ కో కంపెనీ వారు ఈ ప్రాజెక్టు పరిసర గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులను గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ మరియు పాణ్యం శాసనసభ్యులకు వివరించారు.తదనంతరం శకునాల వద్ద నిర్మించిన సోలార్ పార్క్ ను కూడా జిల్లా కలెక్టర్ మరియు పాణ్యం శాసనసభ్యులు సందర్శించి దాని ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ వివరాలను గ్రీన్కో ప్రాజెక్ట్ డైరెక్టర్ ను శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ కో కంపెనీ ప్రతినిధులు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, గ్రీన్ కో అధికారులు మరియు సిబ్బంది, ఓర్వకల్ తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

About Author