ఎలక్ట్రికల్ అంబులెన్స్ లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 12 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన రెండు ఎలక్ట్రికల్ అంబులెన్స్ లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.శనివారం కలెక్టరేట్ లో ఎలక్ట్రికల్ అంబులెన్స్ ను రిబ్బన్ కట్ చేసి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అవసరమైన రెండు ఎలక్ట్రికల్ అంబులెన్స్ ప్రారంభించడం జరిగిందని. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రికల్ అంబులెన్స్ వినియోగిస్తున్నామని అన్నారు ఈ అంబులెన్స్ అధునాతన వసతులతో కూడినవి ఆసుపత్రిలోని అత్యవసర పేషెంట్లకు క్యాజువాలిటీ నుండి స్కానింగ్ కొరకు, ఈసీజీలు. వైద్య పరీక్షల కొరకు ఒక చోట నుండి వేరే ఒక చోటికి తీసుకుని వెళ్లడానికి చాలా అనువుగా ఉంటాయని అన్నారు ఈ అంబులెన్సులు ఈరోజు నుంచి ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎలక్ట్రికల్ అంబులెన్స్ సేవలందిస్తాయని అన్నారు. అంబులెన్సులో స్ట్రక్చర్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఓ అప్పలకొండ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ నరేంద్ర నాథ్ రెడ్డి,DM&HO రామగిడ్డయ్య, తదితరులు పాల్గొన్నారు.