PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాడు-నేడు పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష

1 min read

– నాడు నేడు క్రింద చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టండి

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన.

పల్లెవెలుగు , వెబ్ కర్నూలు : నాడు నేడు క్రింద చేపడుతున్న పనులకు ప్రాధాన్యత ఇస్తూ త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలు లో విద్యా శాఖ, మన బడి నాడు-నేడు పనుల పురోగతిపై జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన బడి నాడు-నేడు క్రింద  పెండింగ్ లో ఉన్న పనులను ప్రణాళిక వేసుకొని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని పాఠశాల కమిటీ అకౌంట్ లో 20 కోట్ల రూపాయలు వున్నాయని నాడు నేడు పనులను వేగం పెంచి బిల్లులను ఎప్పటికీ అప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. నాడు-నేడులో భాగంగా నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రతి వారం నిర్మాణంలో పురోగతి సాధించాలన్నారు. అందులో సమగ్రశిక్ష వారి ద్వారా 31, పంచాయతీ రాజ్ 17, ఆర్డబ్ల్యూఎస్ 16, ఏపీఈడబ్ల్యుఐడీసీ 16, పిహెచ్ఈడి 1 మొత్తం 81 అంగన్వాడీ లను అక్టోబర్ 2 నాటికి నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది వరకే నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు చాలా వరకు టాయ్లెట్స్ లేవని వాటిని కూడా నిర్మించాలన్నారు, టాయ్లెట్ల నిర్మాణం కోసం సొంత భవనాలకు వెంటనే అనుమతులు మంజూరు చేయడంతో పాటు అద్దె రహిత భవనాలకు కూడా నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు గాను సంబంధిత శాఖల సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలు పూర్తి అయిన వాటికి త్వరితగతిన నీటి సదుపాయం కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈకి కలెక్టర్ సూచించారు.  ఇంకా ఎనిమిది పాఠశాలల్లో మరమ్మత్తులు చేయవలసి ఉన్నదని,17 పాఠశాలలలో టాయిలెట్స్ మరమత్తులు,18 పాఠశాలలలో విద్యుద్దీకరణ పనులను చేయవలసి ఉన్నది అని అన్నారు, శనివారం నాటికి విద్యుద్దీకరణ పనులను,సోమవారం  నాటికి  టాయిలెట్స్ పనులను  పూర్తిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నాలుగు పాఠశాలల్లో విద్యుద్దీకరణ పనులు పూర్తి కానప్పటికీ పూర్తి అయినట్టుగా ఫోటోలను ఇంజనీరింగ్ అసిస్టెంట్ నమోదు చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పైచర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం ను ఆదేశించారు.తడకనపల్లి పాఠశాలల్లో టాయిలెట్స్ మరమ్మత్తుల కోసం అనుమతులు పొంది, నూతన టాయిలెట్స్ నిర్మాణం ఎలా చేపడతారని  సంబంధిత అధికారుల నుండి వివరణ తీసుకోవాలని ఎస్ఎస్ఏ పీఓ వేణుగోపాల్ ను  కలెక్టర్ ఆదేశించారు.నిర్మాణములో ఉన్న 310 పాఠశాలల్లోని 1330  అదనపు తరగతి గదులను ఆగస్టు నెల చివరి నాటికి,రన్నింగ్ వాటర్, కిచెన్ షేడ్స్, టాయ్లెట్స్ ను జులై 30 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా సరఫరా చేయబడిన మెటీరియల్ కు సంబంధించిన బిల్లులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల ఇంజనీర్లు ఆన్లైన్ నందు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో పిఓ ఎస్ఎస్ఏ వేణుగోపాల్, డిఈఓ రంగా రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, ఏపీఈడబ్ల్యుఐడీసీ మనోహర్, ఐసిడిఎస్ పిడి ఉమామహేశ్వరి,ఈఈలు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

About Author