జిల్లా ఐ ఎన్ టి యు సి నూతన కార్యవర్గ ఎన్నిక …
1 min read
అధ్యక్షులు బి బతుకన్న..
కర్నూలు, న్యూస్ నేడు: ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు శ్రీ జీ.సంజీవరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు బి బతుకన్న ఆద్వర్యంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశము కర్నూల్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ కార్మికుల కోసం, కర్షకుల కోసం నిరంతర పోరాటం చేస్తున్న అతి పెద్ద కార్మిక సంఘము ఐ ఎన్ టి యు సి అని అన్నారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు బి బతుకన్న మాట్లాడుతూ కార్మికులందరికీ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం ఐ ఎన్ టి యు సి పని చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. కార్మికులు వారి హక్కులకి నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఐ ఎన్ టి యు సి సంస్థ పని చేస్తుందని, అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షులుగా రేపల్లె ప్రతాప్ ని ఎన్నుకోవడం జరిగింది. అదే విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ప్రెస్, రైల్వే డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, భవన నిర్మాణ కార్మికులు, ఫోటో గ్రాఫర్స్, ఆటో యూనియన్, స్లీపర్స్ వారు నియామక పత్రాలను అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజక వర్గ కోఆర్డినేటర్ అనంత రత్నం మాదిగ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ ఎన్ సి బజారన్న, జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్, మాజీ ఎస్సీ సెల్ చైర్మన్ ఎండ్లూరి లాజరస్, జిల్లా మహిళా కాంగ్రెస్ ఎస్ ప్రమీల, జిల్లా సేవాదళ్ ఏ వెంకట సుజాత, మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్త, సయ్యద్ నవీద్, అబ్దుల్ హై, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రాఘవేంద్రప్రసాద్, గవర్నమెంట్ ప్రెస్ హసన్ భాష, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సురేష్, ఆనందం, జేమ్స్, మహేష్, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.