NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్రాంతి సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: సంక్రాంతి సందర్భంగా గడివేముల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సీబీ 11 నిర్వాహకులు తెలిపారు బుధవారం నాడు క్రికెట్ పోటీలను జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య రాజా రాజేశ్వరి కరస్పాండెంట్ రామేశ్వరరావు భారత్ గ్యాస్ రవి కిరణ్ ఉప సర్పంచ్ బాల చెన్ని ఆధ్వర్యంలో ప్రారంభించారు దాదాపు 30 టీములు ప్రస్తుతానికి నమోదు చేసుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా 20000.. రెండో బహుమతిగా 15000.. మూడో బహుమతిగా 10000.. ఐదవ బహుమతిగా 5000 ఇవ్వనున్నట్టు తెలిపారు.

About Author