దామగట్లలో జిల్లా స్థాయి పురుషుల కబడ్డీ పోటీలు ప్రారంభం
1 min readపల్లెవెలుగువెబ్, నందికొట్కూరు: క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని మండలంలోని దామగట్ల గ్రామంలో జిల్లా స్థాయి పురుషుల కబడ్డీ పోటీలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటున్నారని గ్రామ సర్పంచి మాధవరం సుశీలమ్మ, నిర్వాహకులు సి.ఎస్.ఐ సంఘము గురువు యోహాన్ బాబు, మాధవరం రత్నం లు తెలిపారు. కబడ్డీ పోటీలకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. పురుషుల కబడ్డీ పోటీలలో ప్రధమ బహుమతి రూ,25000, రెండవ బహుమతి రూ, 20000, మూడవ బహుమతి రూ,15000, నాల్గువ బహుమతి రూ, 10000, ఐదవ బహుమతి రూ,5000 అందజేయడం జరుగుతుందన్నారు.
అలాగే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సహకారంతో మహిళల ఓపెన్ కబడ్డీ పోటీలు 26న ఆదివారం ప్రారంభం కానున్నాయని తెలిపారు.మహిళల కబడ్డీ పోటీలలో విజయం సాధించిన జట్లకు ప్రధమ బహుమతి రూ,12000, రెండవ బహుమతి రూ,9000,మూడవ బహుమతి రూ,6000, నాల్గువ బహుమతి రూ,4000 లు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళల కబడ్డీ పోటీలలో పాల్గొని ఓడిన ప్రతి జట్టుకు రూ,1000 లు ప్రత్యేక బహుమతి అందజేయడం జరుగుతుందన్నారు.గ్రామంలోని ఎస్ సి కాలనీ అంగన్ వాడీ కేంద్రం ఆవరణలో నిర్వహించే పోటీలను నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు.కబడ్డీ పోటీలలో గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే ఆర్థర్ చేతుల మీద బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.కబడ్డీ పోటీలలో పాల్గొను క్రీడాకారులకు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.