ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా మహ సభలను జయప్రదం చేయండి
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: స్థానిక మడివాల మచిదేవుని గుడి అవరణము నందు ఆంద్రప్రదేశ్ రజక వృత్తిదారుల జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు అధ్యక్షతన సంఘం పెద్దలు కురుకుంద నాగరాజు.మంగయ్య మల్లికార్జున మాట్లాడుతూ రజకులకు రక్షణ చట్టం తీసుకురావాలని, రజక వృత్తిదారుల సంఘం జిల్లా 6వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రజక వృత్తిదారులకు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న సామాజిక దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈనెల 22న కోడుమూరులో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు మండలంలో ఉండే రజక వృత్తిదారులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో మల్లికార్జున. సున్నం వీరేష్. హనుమేష్. కృష్ణ. వీరేష్.రాము.గదిలింగ.సంతాగేరినాగరాజు పాల్గొన్నారు.
