PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిద్ధార్థ రెడ్డిని కలిసిన ఐటి విభాగం జిల్లా అధ్యక్షుడు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని 49బన్నూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడు నంద్యాల జిల్లా వైఎస్సార్సీపి సమాచార సాంకేతిక విభాగం జిల్లా అధ్యక్షులు(ఐటి విభాగం)ఎస్.జగన్ మోహన్ రెడ్డి శాప్ చైర్మన్ మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కలిసి పూల బోకే అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఐటి విభాగం జిల్లా అధ్యక్షులుగా పదవి వచ్చినందుకు గాను కర్నూలులోని సిద్ధార్థ రెడ్డి స్వగృహంలో గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ సమావేశం కార్యక్రమం అనంతరం సిద్ధార్థ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.ఈకార్యక్రమంలో సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి,వైస్ ఎంపీపీ టి.నబి రసూల్,తిమ్మాపురం సర్పంచ్ నాగ స్వామి రెడ్డి,బన్నూరు షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

About Author