బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి…జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు , వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా ను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పిలుపు నిచ్చారు.ఆదివారం నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ పిలుపు మేరకు సేవ్ చైల్డ్ హుడ్ – సేవ్ ఇండియా అన్న నినాదంతో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుంచి గాయత్రి ఎస్టేట్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్కిల్ వరకు క్యాండిల్ ర్యాలీ ని నిర్వహించారు.ర్యాలీకి జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిరోధించడం ప్రభుత్వ శాఖలదే కాదని, ఇది సామాజిక బాధ్యత అన్నారు… బాల్య వివాహాలు చేయడం ద్వారా సమాజంలో అనర్థాలు తలెత్తుతాయన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలన్నారు..ప్రభుత్వం గత వారం రోజులుగా ఇంటింటికీ తిరిగి డ్రాప్ ఔట్ అయిన పిల్లలను గుర్తించి బడి, కళాశాలల్లో చేర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు..తల్లిదండ్రులు పిల్లలను బరువు, బాధ్యతలు గా భావించి, త్వరగా వివాహాలు చేస్తున్నారన్నారు..కానీ బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం అని గుర్తించాలన్నారు…ముఖ్యమంత్రి ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, బాలికల భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా బాధ్యత తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు..తల్లిదండ్రులు సమాచారం ఇస్తే వారి పిల్లలకు ఉన్నత విద్య అందించే వరకు అన్ని విధాలా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.ర్యాలీలో కలెక్టర్ సతీమణి స్వర్ణ లత,DLSA చైర్మన్ శ్రీనివాస రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదా బేగం, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారి కేఎల్ఆర్ కె కుమారి,విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.