జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ను వార్షిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ
1 min read
స్వచ్ఛభారత్, స్వర్ణ ఆంధ్ర నిర్వహించాలి
అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట గస్తీ మరింత పెంచాలి
గంజాయి రవాణా,నాటు సారా తయారీపై కఠిన చర్యలు చేపట్టాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు. ముందుగా జిల్లా ఎస్పీ కి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.పోలీస్ స్టేషన్లకు వచ్చే నిరుపేదలు, వృద్ధులు, మహిళల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి అధికారులు కృషి చేయాల న్నారు. స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రత పాటించాలి. పోలీస్ అధికారులు బేసిక్ & విజిబుల్ పోలీసింగ్ ద్వారా నేర నియంత్రణ చేపట్టాలి.రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవాన్నరు. గంజాయి రవాణా,నాటు సారా తయారీపై కఠిన చర్యలు చేపట్టా లన్నారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలనీ.తరుచుగా రిపోర్ట్ అవుతున్న నేరాలను విశ్లేషించాలనీ.పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించి జిల్లా ఎస్పీ తగిన సూచనలు, సలహాలు , ఆదేశాలు ఇచ్చినారు.అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట గస్తీని మరింత ముమ్మరం చేసి, అనుమానాస్పద వ్యక్తుల యొక్క కదలికలపై నిఘా నిర్వహించి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ ద్వారా తనిఖీ చేయాలన్నారు.రౌడీ షీటర్లు, చెడు నడత గల వ్యక్తుల వివరాలు సేకరించి, వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి.
ప్రజలకు సైబర్ నేరాల ప్రమాదాలు వివరించి, అవగాహన కల్పించాలన్నారు.
సైబర్ నేరాలపై సోషల్ మీడియా ద్వారా జరిగే అనర్ధాలను గురించి ప్రజలకు మహిళలకు మరియు బాలికలకు స్కూలు కాలేజీల వద్ద పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎవరైనా సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 కి తెలియజేసిన వారికి సహాయం అందిస్తారనే విషయాలపై అవగాహనను కల్పించా లన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ నందు ప్రజల ఇచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించి, సంబంధిత పోర్టల్‌లో నివేదికలు అప్‌లోడ్ చేయాలన్నారు. జి.ఎం.ఎస్.కే.ల ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవలని సూచించారు.మహిళలు, బాలికల సంరక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి యాప్ ను మహిళలు బాలికల యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్‌లోడ్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నరు. స్కూళ్లు, కాలేజీల్లో శక్తి యాప్ ను గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాన్నరు. ఆపద సమయాలలో మరియు అత్యవసర పరిస్థితులలో శక్తి యాప్ను గాని లేదా డయల్ 112 గాని సమాచారాన్ని అందించిన ఎడల నిమిషాల వ్యవధిలో బాధితులకు సహాయం అందించబడుతుందని సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో అన్ని ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు ఎస్పీ దశ దిశను నిర్దేశించరు. జంగారెడ్డిగూడెం డిఎస్పి యు రవిచంద్ర, జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ కృష్ణ బాబు మరియు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
