NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన  జిల్లా ఎస్పీ

1 min read

జిల్లా పోలీసు కార్యాలయంలో “ మొబైల్ రికవరీ  మేళా ” కార్యక్రమం.

http://Kurnoolpolice.in/mobiletheft  లింకును క్లిక్ చేసి , సెల్ ఫోన్లు పోగోట్టుకున్న బాధితులు  ఆ మొబైల్ ఫోన్  వివరాలు నమోదు చేయండి.

ఉచితంగా సెల్ ఫోన్ రికవరీ చేస్తాం… ఎలాంటి రుసుము లేదా ఫీజు గాని ఉండదు.

http://Kurnoolpolice.in/mobiletheft    పోలీసు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

కర్నూలు, న్యూస్​ నేడు: శుక్రవారం కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు రికవరీ చేసిన 600 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు  బాధితులకు  అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో “మొబైల్ రికవరీ  మేళా” కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్లు ను బాధిత ప్రజలకు అందజేశారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ  మీడియాతో మాట్లాడారు. ఈ రోజు కర్నూలు పోలీసులు 600   ( విలువ రూ. 1 కోటి 20 లక్షలు) మొబైల్ ఫోన్లను రికవరీ చేశారన్నారు. ప్రజలు రైల్వేస్టేషన్లు, జాతరలలో , స్కూల్స్, కళాశాలలో మొబైల్స్ ను పొగోట్టుకుంటున్నారన్నారు.మహరాష్ట్ర, తమిళనాడు, చెన్నై, హైదరాబాద్ , పలు జిల్లాల నుండి రికవరీ చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క పోలీసును, ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పోలీసులను అభినందిస్తున్నామన్నారు.ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉందన్నారు.ప్రతి రోజూ ప్రతి పని లో మొబైల్ ఉపయోగం ఉంటుందన్నారు. మొబైల్ లో మనకు సంబంధించిన పర్సనల్ వివరాలు,  ఫోన్ నెంబర్లు, వ్యాపార లావా దేవిలు, అటాచ్ మెంట్స్, సెంటిమెంట్స్, ఆన్ లైన్ బ్యాంకు ఖాతా వ్యవహరాలు  ఇలా చాలా మిస్ అవుతూ ఉంటారన్నారు. ఎవరైనా మొబైల్ పోగోట్టుకుంటే  వెంటనే కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు http://Kurnoolpolice.in/mobiletheft   వెళ్ళి పొగోట్టుకున్న మొబైల్ IME  వివరాలు తెలియజేస్తే సెల్ పోన్ రికవరీ చేసేందుకు కర్నూలు పోలీసులు కృషి చేస్తారన్నారు. ఈ పోలీసు సేవ కు ఏలాంటి రుసుము చెల్లించకుండా ఉచితం అని , మొబైల్ పోయిన తర్వాత బాధపడడం కంటే ఆ మొబైల్ ఫోన్ పోగోట్టుకోకుండా జాగ్రత్తలు పాటించడం మంచిదని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్   తెలిపారు.సెల్ ఫోన్ పొగోట్టుకున్న బాధితులు రికవరీ చేసి ఇచ్చినందుకు  జిల్లా ఎస్పీ కి, సైబర్ ల్యాబ్ పోలీసులకు  కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, కర్నూలు డిఎస్పీ  బాబు ప్రసాద్, ఎఆర్ డిఎస్పీ  భాస్కర్ రావు,   సిఐలు తేజమూర్తి, అబ్దుల్ గౌస్, రామయ్యనాయుడు,  నాగరాజా రావు,  సైబర్ ల్యాబ్ సిఐ వేణుగోపాల్, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం పాల్గొన్నారు.

About Author