జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంత్ కి డీజీపీ డిస్క్ అవార్డు ప్రధానం..
1 min readశాంతి భద్రతల పరిరక్షణ, దిశ కేసుల్లో వేగవంతం, బెస్ట్ పోలీసింగ్ పై ఉత్తమ ప్రతిభకు అవార్డు..
డి.జి.పి కె వి రవీంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి డిస్క్ అవార్డు ఈ రోజు అనగా శనివారం నాడు మంగళగిరిలో అవార్డును ప్రదానం చేసిన రాష్ట్ర డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్. 2022 సంవత్సరంలో శాంతి భద్రతల పరిరక్షణ, కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్, తదితర విభాగాలలో ఏలూరు జిల్లా ఎస్పీ ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతిష్టాత్మకమైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిస్క్ (డిజిపి డిస్క్ అవార్డు )అవార్డు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ కి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఐ పి ఎస్ ఈరోజు మంగళగిరిలో ప్రదానం చేశారు. 2022 సంవత్సరంలో శాంతిభద్రతల పరిరక్షణ, కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్, దిశ కేసుల్లో వేగంగా స్పందించి పరిష్కారం చూపడం, తదితర విభాగాలలో ఎస్పీ ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు గుర్తించి పతకం అందజేశారు. కన్విక్షన్ బేస్ పోలీసింగ్ విధానాన్ని ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ సమర్థవంతంగా నిర్వహించి కీలక కేసులలో స్పీడ్ ట్రైల్ నిర్వహణకు సహకరించి నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షలు పడేలా కృషి చేశారు.