PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా సర్వే శాఖ డేటా ప్రాసెసింగు సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టరు

1 min read

– అత్యంత వేగంగా రీ సర్వే రికార్డుల కు ఉపయోగం..

పల్లెవెలుగు వెబ్ పశ్చిమ గోదావరి జిల్లా : బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేటు మొదటి అంతస్తు విడియో కాన్ఫరెన్స్ హాలు ప్రక్కన జిల్లా సర్వే శాఖ  డేటా ప్రాసెసింగు సెంటరు నూతన కార్యాలయాన్ని జిల్లా జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి తో కలసి జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ రీ సర్వే రికార్డులను అత్యంత వేగవంతంగా చేయడానికి ఈ నూతన కార్యాలయంను ఉపయోగించనునట్లు ఆమె తెలిపారు. డేటా ప్రాసెసింగు సెంటరుకు 20 మంది సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించామని, పనులు వేగవంతం చేసి మంచి ఫలితాలు సాధించాలన్నారు. అత్యాధునికమైన కంప్యూటర్లను ఏర్పాటు చేసి రికార్డులు వేగవంతం చేసి,మూడవ దశ రీ సర్వే పనులు నవంబరు చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు  కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె కృష్ణవేణి, ఆర్డీవో కె శ్రీనివాసులు రాజు, డిప్యూటీ ట్రైనీ కలెక్టరు కానాల సంగీత్ మాధుర్, జిల్లా సర్వే అధికారి కె జాషువా, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జివికె మల్లిఖార్జునరావు, డ్వామా పిడి ఎస్టివి రాజేశ్వరరావు, జిల్లా అగ్ని మాపక ధళ అధికారి బి శ్రీనివాస రావు, జిల్లా గృహానిర్మాణ శాఖ డిఇ బి పిచ్చియ్య, జిల్లా కలెక్టరు కార్యా లయం ఏవో వైకెపి అప్పా రావు, సర్వే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About Author