PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేవిపిఎస్ అధ్వర్యంలో జిల్లా వ్యాప్త ఆందోళనలు

1 min read

– దళితున్ని కులం పేరుతో దూషించి, ఫిర్యాదు చేసినందుకు ఇంటిపై దాడి
– చేసిన వాళ్లపై ఎస్ సి ,ఎస్ టి కేసు నమోదు చేయాలి : కేవిపిఎస్
– పోలీసులే దళితులపై జరిగే దాడుల పట్ల వివక్ష చూపితే ఎలా?
– దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్: కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: కౌతాళం మండలంలోని కరిని గ్రామంలో మారయ్య అనే వ్యక్తి నీ అదే గ్రామానికి చెందిన శ్రీరాములు మరియు అయ్యమ్మ లు కులం పేరుతో ఫోన్ సంభాషణ లో మాదిగ నా కొడకా అని అసభ్యకరంగా మాట్లాడారని, దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, తిరిగి వస్తున్న మారయ్యను అడ్డుకొని చంపుతామంటూ భయపెట్టినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్,మండల నాయకులు మరేశ్,ఎస్ మునిస్వామి,దేవదాసీలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన విలేకులతో మాట్లాడుతూ ఏప్రిల్ 24 న జరిగిన ఘటనపై ఆడియో ఆధారాలతో ఉన్నా పోలీసులు కేసు నమోదు చేయకుండా, పోలీసులే రాజీ ప్రయత్నం చేయడం దారుణం అన్నారు. కేసు నమోదు చేయని కారణంగా పోలీసుల అండతో తిరిగి శ్రీరాములు బంధువులు మారయ్య అన్న హనుమంతు ఇంటిపై మే 3న దాడి చేసి మీ తమ్ముడు తో రాజీ చేయించకపోతే మీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తామంటూ భయపెట్టడం ఏమిటని, ఒకవైపు పోలీసులు బాధితులను పోలీస్ స్టేషన్ కు రమ్మంటూనే మరోవైపు దాడి చేసిన వారికి కూడా సమాచారం ఇస్తున్నారన్నారు. దానితో దాడి చేసిన వారు మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే గర్వంతో ఆటోలో గుంపులుగా బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే కౌతాళం ఎస్సై కలుగజేసుకొని నిందితులపై ఎస్ సి,ఎస్ టి కేసు నమోదు చేసి,తక్షణమే కులం పేరుతో దూషించి,దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోతే దళిత కుటుంబాలకు అండగా కేవిపిఎస్ అధ్వర్యంలో జిల్లా వ్యాప్త ఆందోళనలు నిర్వహించడంతోపాటు.. దళితులపై దాడుల పట్ల కౌతాళం పోలీసులు చూపించిన వివక్షకు వ్యతిరేకంగా చలో కౌతాళం కార్యక్రమం చేపడుతామని అన్నారు.

About Author