PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మార్చి 23న జిల్లా యువజన ఉత్సవ్ ఇండియా కార్యక్రమం

1 min read

–యువతలో సృజనాత్మకతను, ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు చేపట్టాలి..
– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : భారత ప్రభుత్వం, యువజన వ్యవహారములుమ మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వారిచే మార్చి 23వ తేదీ న జిల్లాస్థాయి యువ జిల్లా ఉత్సవ్ ఇండియా @2047 కార్యక్రమాన్ని స్థానిక రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఏలూరు లో ఉదయం 8:30 గంటల నుండి నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన అధికారి దూలం కిషోర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఏలూరు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ , సెట్వెల్ సి ఇ ఓ మెహర్ రాజ్ మరియు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సూర్యచక్రవేణి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ యువతలో సృజనాత్మకతను వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసే ఇటువంటి కార్యక్రమాలు అవసరమని మన నగరాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యువత విరివిగా పాల్గొని తన ప్రతిభను చాటాలని అందుకుగాను అందరికీ ముందుగా అభినందనలు తెలియజేశారు.జిల్లా యువజన అధికారి దూలం కిషోర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 180 జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా వాటిలో ఒకటిగా మన ఏలూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని అమృత కాల్ పంచప్రాన్ అనే సందేశం తో నిర్వహిస్తున్నామని అందువల్ల జిల్లాలోనే 15 సంవత్సరాల నుండి 29 సంవత్సరాలు వయసున్న కలిగిన యువతి యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటి విజయవంతం చేయవలసిందని కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా యంగ్ ఆర్టిస్ట్ – పెయింటింగ్ , యంగ్ రైటర్స్ పోయెట్రీ , ఫోటోగ్రఫీ , డిక్లమేషన్, ఉపన్యాస పోటీ, కల్చరల్ ఫెస్టివల్ – గ్రూప్ డాన్స్ అనే ఐదు విభాగాలలో పోటీలు నిర్వహించి గెలుపొందిన మొదటి మూడు స్థానాలలో వారికి సర్టిఫికెట్ మరియు నగదు బహుమతులు అందించడంతోపాటు వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం మూడు గంటల నుండి నిర్వహించబడే సమావేశ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు పుర ప్రముఖులు పాల్గొంటారని విజేతులకు బహుమతులు అందజేయడం జరుగుతుందని అందువల్ల అర్హులైన యువతీ యువకులు అందరూ ఈకార్యక్రమంలో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

About Author