ప్రజల ఆకాంక్షల మేరకే జిల్లాలు ఉండాలి
1 min readపల్లెవెలుగువెబ్ : కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల ఆకాంక్షల మేరకే వ్యవహరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై వైసీపీ నుంచే వ్యతిరేకత వస్తోందని చంద్రబాబు తెలిపారు. అశాస్త్రీయంగా జిల్లాల విభజనతో ప్రాంతాల మధ్య విబేధాలు తలెత్తే పరిస్థితి వచ్చిందన్నారు. మంత్రి వర్గంలో సమగ్రంగా చర్చించకుండా రాత్రికి రాత్రే నోటిఫికేషన్ ఎందుకు ? అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యను పక్కదోవ పట్టించేందుకే తెరపైకి కొత్త జిల్లాల ఏర్పాటు తీసుకొచ్చారని అన్నారు. ఎన్టీఆర్ ను ఎవరు గౌరవించినా ఆహ్వానిస్తామని తెలిపారు.