PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విభిన్న ప్రతిభావంతల సమన్వయ కమిటీ సమావేశం

1 min read

– విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్ధైర్యంతో జీవించేలాగా..

– సంక్షేమాలు అందేలాగా సమన్వయ కమిటీ కృషిచేయాలి..

– విభిన్న ప్రతిభావంతల సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వెల్లడి..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  విభిన్న ప్రతిభావంతుల ఆత్మస్ధైర్యంతో జీవించేలాగా, సామాజిక న్యాయం సాధికారత సూత్రాల ఆధారంగా సమన్వయ కమిటీ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు.  శుక్రవారం కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ఏర్పాటు చేసినజిల్లాస్ధాయి సమన్వయ కమిటీ రెండోవ సమావేశం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అమలు చేస్తున్న పధకాలన్నీ వారికి చేరేలాగా అధికారులు ,సమన్వయకమిటీ సభ్యులు కృషి చేయాలని అన్నారు.  గత ఏప్రిల్ 24న విభిన్న ప్రతిభావంతుల సమన్వయకమిటీ తొలి సమావేశంలో కమిటీ సభ్యులు సూచించిన ప్రగతి అంశాలపై తీసుకున్న చర్యల గురించి ఈ సమావేశంలో జిల్లా విభిన్నన ప్రతిభావంతుల అసిస్టెంట్ డైరెక్టర్ జి.సిహెచ్ ప్రభాకర్ సమావేశంలో తెలియజేయజడం జరిగింది.  సదరు సమావేశమునందు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల ముఖ్య సమస్యలపై కమిటీ సభ్యులు సమావేశంలో తెలియపరచడం జరిగింది.  వీటిలో ముఖ్య సమస్యయైన సదరం ధృవపత్రం నందలి తప్పులు, సవరణ నిమిత్తం అనగా విభిన్న ప్రతిభావంతుని పేరు, తండ్రిపేరు, అడ్రసు, పుట్టిన తేది , మొదలగు సమాచారం,    వైకల్య శాతం మినహా మిగిలిన సమాచారం మార్పు చేసుకొనుటకు ప్రత్యేక ఆప్షన్ ప్రవేశ పెట్టవలసిందిగా కోరిన పిదప సదరు విషయమై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఆర్. విజయరాజు వివరణ ఇస్తూ సదరం ధృవపత్రం నందలి తప్పుల సవరణలనిమిత్తం విభిన్న ప్రతిభావంతుల ధరఖాస్తు చేసికొనినచో వారి పెన్షన్ తొలగించడం జరుగుతుందనే అపోహ కలదని అటువంటి అపోహలు నిజం కాదని కావున విభిన్న ప్రతిభావంతులు నిరభ్యంతరంగా సదరం ధృవపత్రం నందలి మార్పులు చేసుకోవచ్చని సమావేశంలో తెలియజేయడం జరిగింది.  ప్రతి ప్రభుత్వ శాఖలలోను విభిన్న ప్రతిభావంతల ప్రమోషన్లు రోస్టర్ ప్రకారంగా ఇచ్చేలాగా చూడాలని, ఆర్పిడి యాక్ట్ పై అవగాహన కల్పించాలని ఆర్పిడి రూల్స్ బ్యానర్స్, పుస్తకాలు ద్వారా అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విభిన్న ప్రతిభావంతులకు, కమ్యూనిటీ భవనం నిర్మాణానికి స్ధలం కేటాయించాలని, ఆర్ టి సి ద్వారా విభిన్న ప్రతిభావంతులకు అందజేస్తున్న సేవలను పూర్తిస్ధాయిలో అందించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్ లో విభిన్న ప్రతిభావంతులకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆ గ్రీవెన్స్ సెల్ లో విభిన్న ప్రతిభావంతులను నియమించాలని అన్నారు,సింగిల్ రేషన్ కార్డు అందించాలని, వివిధ వ్యాపారాలకు ఫైనాన్స్ గా బ్యాంకు రుణాలు ఇప్పించాలని పిల్లలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలన్నారు, విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి స్కిల్స్ ను అభివృద్ధి చేయాలని తదితర అంశాలను సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ కె. రవికుమార్, జిల్లా ఆసుపత్రి సమన్వయ అధికారులు డా. కె.పాల్ సతీష్ కుమార్, డా. నాగేశ్వరరావు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజరు నీలాధ్రి, దివ్యాంగుల ప్రతినిధులు జిడివిఎస్ వీరభద్రరావు, జి. రాధారాణి, శ్రీమధన్, బి. గిడిఎన్, విడుదల యుగంధర్, సిహెచ్ జాకబ్, ప్రవీణ్ వర్మ, వి. నాగబాబు, తదితరులు పాల్గొన్నారు.

About Author