PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విడాకులు.. భార్య కూడ భ‌ర‌ణం ఇవ్వాల్సిందే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సాధార‌ణంగా భార్యాభ‌ర్త‌లు విడాకులు తీసుకున్న‌ప్పుడు భ‌ర్త నుంచి భార్య భ‌ర‌ణం పొందుతుంది. అదే స‌మ‌యంలో భార్య భ‌ర్త నుంచి విడాకులు కోరితే భ‌ర్త‌కు భ‌ర‌ణం చెల్లించాల‌ని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది. మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ జంటకు 1992లో వివాహం జరిగింది. కొన్నాళ్లు సవ్యంగా సాగిన వీరి సంసారంలో సమస్యలు తలెత్తాయి. దీంతో భర్త నుంచి విడాకులు ఇప్పించాలని భార్య.. 2105లో నాందేడ్​ సివిల్​ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు వారికి అదే ఏడాది విడాకులు మంజూరు చేసింది. అయితే దీనిపై భర్త కోర్టును ఆశ్రయించాడు. హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్​ 24, 25 ప్రకారం భార్య నుంచి శాశ్వత భరణం, జీవనాధార ఖర్చులు ఇప్పించాలని కోరుతూ పిటిషన్ వేశాడు. భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. మంచి వేతనం తీసుకుంటోందని, ఆమెకు ఆ ఉద్యోగం రావడానికి తాను ఎంతో కష్టపడ్డానని భర్త కోర్టుకు విన్నవించుకున్నాడు. విడాకులు తీసుకోవడం వల్ల తన జీవితం అస్తవ్యస్తమవుతుందని తెలిపాడు. ఈ పిటిషన్​ను విచారణకు స్వీకరించిన నాందేడ్​ సివిల్​ కోర్టు.. భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆమె తరపు న్యాయవాది.. ఔరంగాబాద్​ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. భర్తకు భార్య భరణం ఇవ్వాల్సిందేనని తీర్పు వెల్లడించింది.

                                    

About Author