భార్యకు విడాకులివ్వొచ్చు.. పిల్లలకు కాదు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వడం కుదురుతుంది కానీ, పుట్టిన పిల్లలకు విడాకులు ఇవ్వడం కుదరదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఒక విడాకుల కేసులో సెటిల్ మెంట్ కోసం ఆరు వారాల్లో 4 కోట్లు చెల్లించాలని భర్తను ఆదేశించింది. అధికరణ 142 ప్రకారం తనకు సంక్రమించిన అధికారంతో సదరు వ్యక్తికి, ఆయన భార్య పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. పిల్లల బాధ్యత తండ్రి పై ఉంటుందని, పిల్లల భవితవ్యం కోసం.. భార్యకు తగిన మొత్తం చెల్లించాలని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.