ఇక్కడ విడాకులు తీసుకోవడం సాధ్యం కాదు !
1 min readపల్లెవెలుగు వెబ్ : భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తే.. వెంటనే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు. ఇద్దరికీ సమ్మతమైతే కోర్టులు విడాకులు మంజూరు చేస్తాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే తతంగం నడుస్తుంది. కానీ ఫిలిప్పిన్స్ దేశంలో మాత్రం ఇది సాధ్యం కాదు. ఇక్కడ విడాకులు తీసుకోవడం అగౌరవంగా భావిస్తారు. ఫిలిప్పిన్స్ దేశంలో క్రైస్తవ క్యాథలిక్ లు ఎక్కువగా ఉంటారు. క్యాథలిక్ పద్ధతులను పాటించేవారు విడాకులను వ్యతిరేకిస్తారు. అందుకే అక్కడి నేతలు విడాకుల చట్టాన్ని తమ దేశ చట్టాల్లో చేర్చలేదు. విడాకుల చట్టం లేకపోవడంతో ఆ దేశంలో విడాకులకు అవకాశమే లేదు. ప్రపంచంలోనే విడాకులు లేని దేశంగా తమ దేశం ఉండాలని అక్కడి నేతలు కోరుకుంటారు. పోప్ ప్రాన్సిస్ అభ్యర్థనను సైతం అక్కడ నేతలు పెడచెవిన పెట్టారు.