దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలి:మడితాటి నరసింహ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలని ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి నియోజకవర్గంలో సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దివ్యాంగులలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ప్రతిభ కలిగి ఉంటుందన్నారు. దివ్యాంగుల పట్ల చిన్న చూపు చూడరాదని, వారికి సమాన అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల ప్రత్యేక ఉపాధ్యాయిని రాపూరి సుజాత దివ్యాంగులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.