PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణకు ప్రతీక దీపావళి

1 min read

జాగృతిచేసే చైతన్యదీప్తిల శోభావళి..

ప్రతి ఇంటా ఆనందదివ్వెలు వెలగాలి…

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్ఏ తొగురు ఆర్థర్.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: దుష్ట శిక్షణ శిష్ఠ రక్షణకు ప్రతీకగా  దీపావళి నిలిస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. జ్ఞానానికి, ఆనందానికి , వికాసానికి, విజయాలకు ప్రతిరూపం దీపావళి అని పేర్కొన్నారు. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తిల శోభావాళి అని, ఎన్నో విజయోత్సవ చరిత్రలను కలిగిన దివ్య చరితావళి ఈ  దీపావళి అని ఆయన తెలిపారు.  దీపావళి అంటే దీపాల వరుస.. ఈ దీపావళి ఆంధ్రప్రదేశ్ కు విజయాల వరుస కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ సకల శుభాలు, శాంతి సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు అందాలని,ప్రతి ఇంటా ఆనందపు కాంతులు వెదజల్లాలని , అజ్ఞానాంధకారాలు తొలగి విజ్ఞానపు వెలుగులు, ఆనంద దివ్వెలు వెలగాలని ఆయన ఆకాంక్షించారు. నందికొట్కూరు నియోజక వర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఎమ్మెల్యే ఆర్థర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

About Author