PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే ఇంట ఘనంగా దీపావళి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె: నియోజకవర్గ ప్రజలకు,వైయస్సార్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె పట్టణం లో బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారి నూతన స్వగృహం లో బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారు,కాటసాని జయమ్మ గారు వారి తనయుడు కాటసాని ఓబుల్ రెడ్డి లతో కలిసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ చెడు అనే చీకటిని పారద్రోలి మంచి అనే వెలుగును నింపి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని కోరుకొంటున్నాను అని చెప్పారు.మనిషి లోని అజ్ఞానంధ కారాన్ని తొలగించి జ్ఞాన దీపాలు వెలిగించేదే దీపావళి పండుగ అని అలాంటి పండుగను మనమందరం సంతోషాలతో జరుపుకోవడం చాలా ఆనందంగా వుందని చెప్పారు.బనగానపల్లె నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు.

About Author