డి.ఎం. పి.జి విద్యార్థుల సేవ.. భేష్..
1 min read
బీరువా, ఫ్రిడ్జ్ అందజేసిన డిఎం పి.జి. విద్యార్థులు సత్య కుమార్, డా. మహేష్
- అభినందించిన కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ డా. చంద్ర శేఖర్
కర్నూలు, న్యూస్ నేడు:ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దాంటో ఎంతో కొంత సమాజ సేవకు, చదివిన పాఠశాలకు, కళాశాలకు వెచ్చించాలని సూచించారు కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ డా. చంద్ర శేఖర్. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కార్డియాలజి విభాగానికి డిఎం. పిజి ఫైనల్ ఇయర్ విద్యార్థులు డా. సత్య కుమార్, డా. మహేష్ రూ.40వేలు విలువ చేసే బీరువా, ఫ్రిడ్జ్ విరాళంగా అందజేశారు. డి.ఎం. పిజి విద్యార్థుల సమక్షంలో బీరువా, ఫ్రిడ్జ్ ను ఓపెన్ చేసిన డా. చంద్ర శేఖర్ మాట్లాడారు. డిఎం పిజి విద్యార్థులు సత్య కుమార్, డా. మహేష్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భవిష్యత్ లోనూ ప్రజలకు వైద్య సేవ చేస్తూ… సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించి.. అందరి మన్ననలు పొందాలని ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ డా. చంద్ర శేఖర్ ఆకాంక్షించారు.
