బీజేపీ నేతలకు ఆ దమ్ము ఉందా ? : మంత్రి పేర్నినాని
1 min read
పల్లెవెలుగువెబ్ : విజయవాడలో బీజేపీ తలపెట్టిన జనాగ్రహ సభ పై ఏపీ మంత్రి పేర్నినాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతలు చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని విమర్శించారు. పెరుగుతున్న డీజిల్, పెట్రోలు ధరలపై బీజేపీ నేతలు బాధపడాలని అన్నారు. పెరుగుతున్న ఎరువుల రేట్లపై బీజేపీ నేతలకు బాధలేదా? అని ప్రశ్నించారు. ఎక్కడ్నుంచో పిలుపు వస్తే.. ఇక్కడ సభ పెడతారని, ప్రజా సమస్యలపై బీజేపీకి దృష్టి లేదని అన్నారు. ప్రజాగ్రహ సభలో పెట్రోల్, డీజీల్ రేట్లపై మాట్లాడాలని మంత్రి పేర్ని నాని బీజేపీ నేతలకు హితవు పలికారు.