NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

28న చలో సిద్దేశ్వరం జయప్రదం చెయ్యండి..

1 min read

పల్లెవెలుగు వెబ్​ నందికొట్కూరు: కృష్ణా నదిపై సిద్దేశ్వరం సోమశిల మధ్య తీగల వంతెన నిర్మాణ వద్దు బ్యారేజ్ కం వంతెన నిర్మాణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వం లో చేపట్టిన ఛలో సిద్దేశ్వరం కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు కొండెపోగు సుంకన్న, గూడూరు రవికుమార్ రెడ్డి ,శివ ప్రసాద్ రెడ్డి, కాటేపోగు చిన్న నాగన్న పిలుపునిచ్చారు. గురువారం మీడియా సమావేశంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు గూడూరు రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ ఊయల బ్రిడ్జి వద్దు బ్రిడ్జి కం బ్యారేజీ ముద్దు అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు 28న శనివారం చలో సిద్దేశ్వరం నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు .గత 75 సంవత్సరాలుగా రాయలసీమ వాసులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. అధికారంలో రాయలసీమ వాసులైనటువంటి ఎందరో ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా రాయలసీమ మీద శ్రద్ధతో రాయలసీమ అభివృద్ధి కోసం కృషి చేయడం లేదని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరకు రాయలసీమ వాసుల అయ్యుండి కూడా వీరు రాయలసీమకు ద్రోహం చేశారే తప్ప ఏ ఒక్క అభివృద్ధికి వాళ్ళు నోచుకోలేదని ఆరోపించారు. ఉయ్యాల బ్రిడ్జి వద్దు బ్యారేజ్ కం బ్రిడ్జి ముద్దు రాయలసీమలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు జడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచులు అందరూ పార్టీలకు అతీతంగా చలో సిద్దేశ్వరం జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనని ప్రతి నాయకులు కూడా రాయలసీమ ద్రోహులుగా మీరు చరిత్రలో మిగిలిపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు శివారెడ్డి ,సాయి మహేష్, సురేష్, రాంబాబు, శ్రీకాంత్, కృష్ణ యాదవ్ నాగరాజు, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

About Author