23న హలో మాల జయప్రదం చేయండి..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/5-5.jpg?fit=550%2C275&ssl=1)
పోస్టర్లను ఆవిష్కరించిన మాల మహానాడు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఈ నెల 23 న కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో జరిగే రాయలసీమ మాలల యుద్ధ గర్జన సభను జయప్రదం చేయాలని నందికొట్కూరు మాల మహానాడు సీనియర్ నాయకులు డాక్టర్ రాజు అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గురువారం అంబేద్కర్ విగ్రహం దగ్గర కర్నూలులో జరిగే రాయలసీమ మాలల యుద్ధ గర్జన పోస్టర్లను మన మహానాడు నాయకులు రాజు, ఏసీ నాగేష్,పబ్బతి శివప్రసాద్, చరణ్ తేజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్గీకరణకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని వర్ధిల్ల జేసే విధంగా రాయలసీమలోని నలుమూల గ్రామాల్లో ఉన్న మాల జాతి సోదరులందరినీ ఐక్యం చేసే విధంగా మాల జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ మాలల యుద్ద గర్జన సభ నిర్వహించడం జరుగుతుంది.వర్గీకరణ చేయడం వల్ల మాల జాతికి మాత్రమే కాకుండా ఎస్సీ కులంలో ఉన్న అనేక ఉప కులాలకు నష్టం వాటిల్లుతుందని అంబేద్కర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగంలో ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ చాలా అత్యున్నతమైన ఆలోచన అని అటువంటి ఎస్సీ రిజర్వేషన్ ను నాలుగు ముక్కలు చేసుకుంటూ స్వార్థ రాజకీయాల కోసం రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఎస్సీ అనే కులాన్ని విభజించి పాలించాలి అనే దుర్మార్గపు ఆలోచనకు వ్యతిరేకంగా మొట్ట మొదటి సారిగా రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి మాల సోదరులు సభను విజయవంతం చేయాలని వారు కోరారు.కర్నూలు పట్టణంలో ఈ సభ జరగడం ఈ సభ ద్వారా స్వార్థ రాజకీయాలకు ముగింపు పలికి సమర్థవంతమైన చైతన్యాన్ని మాలల్లో తీసుకురావడానికి వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్క మాల సోదరుడు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్,మనోహర్,నాగన్న,సుబ్బన్న, బాబు,అరుణ్,చిన్న ఎర్రన్న,పుల్లన్న,తిక్కస్వామి పాల్గొన్నారు.