నాకు అర్హత లేదా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేయకపోవడం పట్ల నటి నగ్మా అసంతృప్తి స్వరాన్ని వినిపించారు. రాజ్యసభలో అడుగుపెట్టడానికి తనకు అర్హత లేదా? అంటూ ఆమె ట్వీట్ చేశారు. రాజ్యసభకు కాంగ్రెస్ ప్రకటించిన పది మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో నగ్మా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభకు కాంగ్రెస్ పది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో చాలా మంది ప్రముఖ నేతల పేర్లు లేవు. రాజ్యసభకు సీట్లు ఆశించిన పలువురు సీనియర్ నేతలు అసంతృప్తికి లోనయ్యారు.