వాటిని వార్తలుగా ప్రచారం చేయొద్దు : నాగార్జున
1 min read
పల్లెవెలుగువెబ్ : సమంత,నాగాచైతన్య విడాకుల అంశం పై అక్కినేని నాగార్జున కీలక వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. విడాకులు కావాలని ముందుగా సమంతనే అడిగిందని, చైతన్య ఆమె నిర్ణయాన్ని గౌరవించి ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై నాగార్జున స్పందించారు. అవి పూర్తిగా తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. ‘సమంత, నాగ చైతన్య విడాకులకు సంబంధించి నేను మాట్లాడినట్లు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తి అబద్దం. దయచేసి పుకార్లను వార్తలుగా ప్రచారం చేయొద్దని మీడియా మిత్రులను కోరుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.