దళితుల భూములను డంపు యార్డుకు కేటాయించ వద్దు
1 min read– వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ డిమాండ్ పట్టణ అభివృద్ధికి రూ: 15.34 కోట్లు మంజూరు
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ కి నూతనంగా ఏర్పాటు చేసే డంపు యార్డ్ కు దళితుల భూములను కేటాయించడాన్ని విరమించుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి ,కౌన్సిలర్ చిన్న రాజులు మున్సిపల్ కమిషనర్ ను డిమాండ్ చేశారు.శనివారం పట్టణంలోని జై కిసాన్ పార్క్ నందు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది .ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల కొరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చర్చించి పట్టణాభివృద్ధికి రూ 15.34లక్షలు మంజూరు చేసినందుకు కౌన్సిలర్లు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .సాధారణ సమావేశంలో పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై మున్సిపల్ డి ఈ నాయబ్ రసూల్ నివేదికను చదివి కౌన్సిల్ ఆమోదం కొరకు ఉంచారు .సమావేశంలో ఏబీఎం పాలెం కు చెందిన కౌన్సిలర్లు ప్రశాంతి ,చిన్న రాజులు మాట్లాడుతూ పూర్వం నుంచి భూమి లేని రెండు వందల మంది దళిత కుటుంబాలు సాగులో ఉన్నారు .సర్వేనెంబర్ 77/1,113,111,70,71లలో సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు .ప్రస్తుతం ఆ భూములలో మున్సిపాలిటీకి సంబంధించి డంపు యార్డును ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారుల ద్వారా చేపట్టిన సర్వేను నిలుపుదల చేయాలని కమిషనర్ ను కోరారు .అనంతరం సమస్యపై కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ్ ఆంధ్ర కమిషన్ ఆదేశాల మేరకు 2050జనాభా లెక్కల దృష్టిలో ఉంచుకొని నూతన డంపింగ్ యార్డ్ నిర్మాణం కొరకు రెవెన్యూ అధికారులకు స్థల సేకరణ కోసం జిల్లా కలెక్టర్ ను కోరడం జరిగింది .డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం 7.50ఎకరాల స్థలం రెవెన్యూ అధికారులు భూ సేకరణ సర్వే చేస్తున్నారని తెలిపారు .మున్సిపాలిటీ పరిధిలో రోజుకు 20టన్నుల చెత్త సేకరించడం జరుగుతుందని ఈ చెత్తను అధునాతన పద్ధతుల ద్వారా తడి, పొడి చెత్త ద్వారా సంపద సృష్టించేందుకు నూతన డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు .మున్సిపాలిటీ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వం భూములను కేటాయిస్తామన్నారు . కౌన్సిలర్ సభ్యులు సహకరించాలన్నారు .అలాగే కౌన్సిలర్ చాంద్ భాష , లక్ష్మీదేవి మాట్లాడుతూ పాత డంపు యార్డులో ని చెత్తను తగలబెట్టడంతో పొగ,కాలుష్యంతో కురువ పేట ,బైరెడ్డి నగర్ తదితర కాలనీలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని ,రైతులు గడ్డివాములు వేసుకున్నారని ఏ క్షణాన అగ్ని బారిన పడే ప్రమాదం ఉందని భయాందోళన చెందుతున్నారన్నారు .అనంతరం కమిషనర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు డంపు యార్డుకు 1.20 సెంట్ల స్థలం ఉండడంతో అది పూర్తిగా నిండిపోయిందని ఇతర ప్రాంతాలకు త్వరలో తరలించే ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు .దళితుల భూములను రక్షించాలంటూ బహుజన సమాజ్ పార్టీ ,సిపిఎం ,ఎమ్మార్పీఎస్ తదితర సంఘాల నాయకులు నాయకులు చైర్మన్, కమిషనర్ కు వినతిపత్రం అందించారు.ఈ సమావేశంలో కౌన్సిలర్లు వివిధ ప్రభుత్వ శాఖ తదితరులు పాల్గొన్నారు.