NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మత ఛాంద‌స‌వాదుల్ని అనుమ‌తించొద్దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ నుంచి సస్పెండయిన నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఇస్లామిక్ దేశాల సరసన ఆఫ్ఘనిస్థాన్ కూడా చేరింది. అలాంటి మత ఛాందసవాదులను భారత ప్రభుత్వం అనుమతించరాదని హితవు చెప్తోంది. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, పవిత్ర మతం ఇస్లాంను అవమానించడానికి, ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టడానికి ఇలాంటి మత ఛాందసవాదులను అనుమతించవద్దని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని చెప్పారు. భారత దేశంలో అధికార పార్టీకి చెందిన ప్రతినిధి ఇస్లాం ప్రవక్తకు వ్యతిరేకంగా అవమానకరమైన మాటలను ఉపయోగించడాన్ని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

                                    

About Author