దళారులు.. ఏజెంట్ల మోస పూరిత మాటలు నమ్మవద్దు
1 min read– ఎస్సై అభ్యర్దులకు సూచన చేసిన …
– కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్
– జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ రేంజ్ పరిధిలో ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి దేహదారుడ్య (PMT/ PET) పరీక్షలకు వెళ్తున్న అభ్యర్థులకు ఉద్యోగాలకు ఎంపికయ్యేలా చూస్తామంటూ మభ్య పెట్టే దళారుల మాటలు నమ్మవద్దని కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ , జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గురువారం సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి పరీక్షలు నిర్వహిస్తున్నందున పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, డబ్బులు ఇచ్చి నష్టపోవద్దని తెలిపారు.ఎలాంటి అవకవతలు జరగకుండా దేహదారుడ్య పరీక్షలు సాంకేతికత మరియు సిసి కెమెరాల నిఘాలో ఉంటాయని అన్నారు.పోలీసు నియామక ప్రక్రియ పోలీసు అధికారుల సమక్షంలో పారదర్శకంగా , నిష్పక్షపాతంగా జరుగుతుందని తెలిపారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని, అందువల్ల అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్దులకు తెలిపారు. దళారుల గురించి తెలిస్తే డయల్ 100 కు గాని, దగ్గర్లోని పోలీసుస్టేషన్ లో గాని సమాచారం అందించాలని, సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సంధర్బంగా కర్నూలు రేంజ్ డిఐజి , కర్నూలు జిల్లా ఎస్పీ తెలిపారు.