PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వస్తువుల నాణ్యత పై రాజీ పడవద్దు

1 min read

– బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS)
– జాయింట్ డైరెక్టర్స్ సుజాత, రామాకాంత్ సాగర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : వస్తువుల నాణ్యత పై రాజీ పడవద్దు అని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) జాయింట్ డైరెక్టర్స్ సుజాత, రామాకాంత్ సాగర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు వస్తూ నాణ్యత ప్రమాణాలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) జాయింట్ డైరెక్టర్స్ సుజాత, రామాకాంత్ సాగర్ లు జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి రాజా రఘువీర్ అధ్యక్షతన జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) జాయింట్ డైరెక్టర్స్ సుజాత, రామాకాంత్ సాగర్ లు మాట్లాడుతూ ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలోని జిల్లా స్థాయి అధికారులందరికీ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు నిత్యం కొనుగోలు చేసే వస్తువులు, సరుకుల విషయంలో ప్రమాణాలు ఉండాలని నిర్దేశిత ప్రమాణాలు లేకపోతే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు వస్తువు పైన ఐఎస్ఐ ముద్ర ఉన్నదా అనేది గమనించాలని, వస్తువు యొక్క తయారీ వివరాలను తెలుసుకోవాలన్నారు భారతదేశంలో తయారే వస్తువులకు ఇండియన్ స్టాండర్డ్ నెంబర్స్ కూడా కేటాయించడం జరుగుతుందని ఏదైనా అనుమానం ఉంటే గూగుల్ సెర్చ్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు అందులో కంపెనీ వివరాలు పూర్తిగా లభిస్తాయి అని తెలియజేశారు డిపార్ట్మెంట్ ల పరంగా కార్యాలయాలకు కొనుగోలు చేసే వస్తువుల పైన ఐఎస్ఐ ముద్ర ఉన్నదా నాణ్యమైన వస్తువ అని వస్తువులను పర్చేస్ చేస్తే బాగుంటుందని తెలియజేశారు.పౌరసరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్ మాట్లాడుతూ మనము పుట్టినది మొదలు మరణించేంతవరకు వినియోగదారులమే కాబట్టి ఇలాంటి అవగాహన కార్యక్రమం మనకు ఎంతో ఉపయోగపడుతుంది దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు వినియోగదారుడు హక్కులతో పాటు బాధ్యతలు కూడా సంపూర్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువునకు బిల్లు తప్పని సరిగా తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలని ఏదైనా వస్తువులో లోపం ఉంటే వినియోగదారుల కోర్టు కి ఆశ్రయించి ఫిర్యాదు చేసి న్యాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, విద్యాశాఖ, శిశు సంక్షేమ శాఖ, వైద్యం మరియు ఆరోగ్యం శాఖ, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author