తాగొద్దు.. నవ్వొద్దు.. ఏడ్వొద్దు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన నియంతృత్వ పోకడలను ప్రదర్శించారు. ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణించి 10 సంవత్సరాలు పూర్తీ కావడంతో 11 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా పలు ఆంక్షలు విధించారు. సంతాప దినాల సమయంలో ఎవరూ మద్యం సేవించకూడదని, నవ్వకూడదని నిబంధనలు విధించారు. వేడుకల్లో పాల్గొనకూడదని, ఎవరైనా చనిపోయినా బిగ్గరగా ఏడ్వకూడదని ఆదేశించారు. డిసెంబర్ 17న ఆ దేశ ప్రజలు నిత్యావసరాలు కొనకూడదని తేల్చిచెప్పారు. సంతాప దినాల సమయంలో కొందరు తాగిపట్టుబడ్డారని, వారిని నేరస్థులుగా పరిగణించి శిక్షించారని .. తర్వాత వారి జాడ లేదని సమాచారం.