PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచ్చులో చిక్కుకోవద్దు… అల్లుఅర్జున్ కు కంగన సలహా !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రముఖ నటి కంగన రనౌత్ తరచూ తనదైన శైలిలో వివిధ అంశాల పై స్పందిస్తారు. తాజాగా దక్షిణాది నటుల గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. సౌత్‌ స్టార్స్‌ అల్లు అర్జున్‌,యశ్‌ల ఫోటోలు షేర్‌ చేసిన కంగనా దక్షిణాది హీరోలకు, సినిమాలకు ఎందుకు అంత ఆదరణ లభిస్తుందన్నది ప్రస్తావించింది. దక్షిణాది స్టార్స్‌ మన దేశ సంస్కృతి సంప్ర‌దాయ మూలాల‌కు క‌ట్టుబ‌డి ఉంటారు. వారు త‌మ కుటుంబాల‌కు, బాంధ‌వ్యాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు. సినిమాపై సినిమాపై వారికున్న ప్యాష‌న్‌, వృతిప‌ర‌మైన నిబ‌ద్ధ‌త అపార‌మైన‌ది అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. బాలీవుడ్‌ మిమ్మల్ని పాడు చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. వారి వ‌ల‌లో చిక్కుకోకండి అంటూ పేర్కొంది.

          

About Author