NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆధార్ కార్డ్, ఫింగ‌ర్ ప్రింట్స్ ఎవ్వ‌రికీ ఇవ్వొద్దు : డీజీపీ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : లోన్‌యాప్స్‌పై ప్రత్యేక నిఘా ఉంచామని డీజీపీ రాజేంద్రనాథ్‌ తెలిపారు. ఇటీవల యాప్‌ల ద్వారా లోన్ తీసుకుని, తిరిగి కట్టలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కొన్ని ఫోన్‌ కాల్స్‌ ప్రైవేట్‌ నెంబర్స్‌ నుంచి వస్తున్నాయని, సైబర్‌ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. లోన్‌యాప్‌ నిర్వాహకులు వేధింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆధార్‌ డేటా, ఫింగర్‌ ప్రింట్స్‌కు ఎవరికి ఇవ్వవద్దని సూచించారు. లోన్‌యాప్‌ల డేటాను సేకరిస్తున్నామని, లోన్‌ వసూళ్లలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉంటే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

                                       

About Author