రైతుల ఖాతాల్లోకి నగదు.. ఇలా చెక్ చేసుకోండి !
1 min readపల్లెవెలుగువెబ్ : కిసాన్ సమ్మాన్ నిధి నిధులను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమచేసింది. పదో విడతగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి విడుదల చేసింది. దాదాపు 10 కోట్ల మంది రైతులుకు.. 20 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. కిసాన్ సమ్మాన్ నిధి డబ్బు అకౌంట్లో పడిందా ? లేదా అన్న విషయం ఎస్ఎంఎస్ ద్వార తెలుసుకోవచ్చు. లేదంటే వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవాలంటే కింది పద్ధతిని అనుసరించాలి :
- ఏం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in కు వెళ్లి, మెనూ బార్ లో ఉన్న ‘ఫార్మర్స్ కార్నర్’ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి (ఎ) ఆధార్ సంఖ్య, (బి) బ్యాంక్ ఖాతా సంఖ్య, (సి) మొబైల్ నంబర్. ఇందులో – ఏదైనా ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు చెల్లింపు చెక్కు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
- ఆధార్ నంబర్, అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, మీరు ‘గెట్ డేటా’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నగదు జమ అయ్యిందో లేదో మీకు చూపిస్తుంది.
- రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌ఎఫ్‌టీని ఆమోదించిన తర్వాత ప్రభుత్వం ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కనిపిస్తుంది. ఒకవేల మీకు రాకపోతే ముందుగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించండి.
- అదే విధంగా పీఏం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉంటేనే నగదు వస్తాయనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.